📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Hari Hara Veeramalu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖ‌రారు

Author Icon By Sudheer
Updated: July 17, 2025 • 9:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైన ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ పాత్రల వేషధారణ, భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌, గ్రాండ్ విజువల్స్ అన్ని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ట్రైలర్ రాకతో బిజినెస్ వర్గాల్లోనూ సినిమా చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్… ప్రముఖులు హాజరు

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తొలుత తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో ఈవెంట్ నిర్వహించే యోచన చేసినప్పటికీ చివరికి హైదరాబాద్‌నే ఫిక్స్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా సినిమా ప్రమోషన్ మరింత ఊపందుకునే అవకాశముంది.

పాన్-ఇండియా విడుదలకు సిద్ధం

పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల వల్ల, కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల చాలా వాయిదా పడింది. అయినప్పటికీ అభిమానుల అంచనాలు ఎక్కడ తగ్గలేదు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మించగా, సంగీతం ఎం.ఎం. కీరవాణి అందించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన విలన్‌గా కనిపించగా, నిధి అగర్వాల్ మరియు నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుండటంతో పవన్ కళ్యాణ్ పాన్-ఇండియా స్థాయిలో మరోసారి మెరపించనున్నారు.

Read Also ; KTR : రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం

Hari Hara Veeramalu Hari Hara Veeramalu hyderabad Hari Hara Veeramalu pre release Pawan Kalyan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.