📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Gaddar Awards : గద్దర్ బెస్ట్ ఫిలిం అవార్డ్స్ లిస్ట్

Author Icon By Sudheer
Updated: May 30, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు (Gaddar Film Awards ) సంబంధించి బెస్ట్ ఫిలిం అవార్డ్స్ లిస్ట్ ను ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ శుక్రవారం విడుదల చేసారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాల ఎంపిక వివరాలను వెల్లడించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అవార్డుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించామని, 2014 జూన్ 2 నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత సెన్సార్ పొందిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ విభాగాల్లో ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఈ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డుల విశ్వసనీయతను మరింతగా పెంచినట్లయింది. తెలుగు సినిమా ప్రపంచంలో సృజనాత్మకత, సామాజిక స్పృహ కలిగిన సినిమాలకు గుర్తింపునిస్తూ ఈ అవార్డులు సినీ పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నాయి.

ఇక అవార్డ్స్ పొందిన చిత్రాలు చూస్తే..

2014 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : రన్‌ రాజా రన్‌
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : అల్లుడు శ్రీను

2015 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రుద్రమదేవి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కంచె
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – శ్రీమంతుడు

2016 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : జనతా గ్యారేజ్

2017 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బాహుబల 2
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : ఘాజి

2018 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : మహానటి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : కేరాఫ్ కంచరపాలెం

2019 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : జెర్సీ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మల్లేశం

2020 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : అల వైకుంఠపురములో..
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : కలర్ ఫోటో
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మిడిల్ క్లాస్ మెలోడీస్

2021 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : ఆర్ఆర్ఆర్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : అఖండ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : ఉప్పెన

2022 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : సీతారామం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : కార్తికేయ 2
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మేజర్

2023 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బలగం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : హనుమాన్
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : భగవంత్ కేసరి

Read Also : నేడు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. ముంబై జ‌ట్టుకు భారీ షాక్‌!

gaddar Awards Gaddar best film awards Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.