తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఎస్తర్ (Esther ) అనిల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె తెల్లని గౌను ధరించి, తన రాబోయే జీవితంలో ఒక కొత్త అధ్యాయం గురించి సూచించారు. “జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తా” అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలకు తావిచ్చింది.
నోయల్‌తో విడిపోయిన ఎస్తర్
ఎస్తర్ గతంలో సింగర్, నటుడు నోయల్ సీన్‌ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వారి వివాహ బంధం కేవలం ఆరు నెలలకే ముగిసింది. అప్పట్లో ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత ఎస్తర్ తన కెరీర్‌పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె జీవితంలో ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.
అభిమానులలో ఆసక్తి
ఎస్తర్ “స్పెషల్ అనౌన్స్‌మెంట్” చేస్తానని చెప్పడంతో ఆమె అభిమానులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ప్రకటన ఆమె కొత్త సినిమా గురించా, లేక వ్యక్తిగత జీవితం గురించా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆమె పెళ్లి చేసుకుంటున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఆమె అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.