📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దృశ్యం 3′ రెడీ: మోహన్‌లాల్

Author Icon By Digital
Updated: February 20, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మోహన్‌లాల్ బిగ్ అనౌన్స్‌మెంట్: ‘దృశ్యం 3’ రాబోతోంది!

ఇంటర్నెట్‌డెస్క్: సినీ అభిమానులకు ఒక గొప్ప వార్తను అందించారు అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ (Mohanlal). ‘దృశ్యం 3‘ (Drishyam 3) రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లోనూ రీమేక్ అయి, అన్ని చోట్లా అద్భుత స్పందనను సొంతం చేసుకుంది.

దృశ్యం 3′ రెడీ: మోహన్‌లాల్

ఓటీటీలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం 2’

ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘దృశ్యం 2‘ వచ్చింది. అయితే, కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించారు. మోహన్‌లాల్ నటన, జీతూ జోసెఫ్ టేకింగ్, ట్విస్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆ కథను కొనసాగిస్తూ మూడో భాగం ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్ అనేక వేదికలపై ప్రకటించారు. సినిమా పట్టాలెక్కడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు ‘దృశ్యం 3’ పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైందని సమాచారం. దీంతో మోహన్‌లాల్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు… ‘దృశ్యం 3′ రాబోతోంది’ అని పేర్కొన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.

దృశ్యం 3′ స్క్రిప్ట్ సిద్ధం – మోహన్‌లాల్ అధికారిక ప్రకటన

దర్శకుడు జీతూ జోసెఫ్ గతంలోనే మూడో భాగం ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు మోహన్‌లాల్ స్వయంగా ‘దృశ్యం 3’ రాబోతోందని అధికారికంగా వెల్లడించారు.

Breaking News in Telugu drishyam drishyam 2 drishyam 3 Google news Google News in Telugu Latest News in Telugu Mohanlal Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.