📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Disha Patani’s sister : పసికందును కాపాడిన దిశా పటానీ సోదరి

Author Icon By Sudheer
Updated: April 20, 2025 • 10:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో ఓ మానవతా ఘటన వెలుగుచూసింది. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ గొప్ప ధైర్యసాహసం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాడుబడిన భవనంలో వదిలేసి వెళ్లిన పసికందును ఖుష్బూ గమనించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా గోడ దూకి చిన్నారిని రక్షించారు. గాయాలతో ఏడుస్తున్న పాపను చూసి చలించిపోయిన ఆమె, తక్షణమే ప్రథమ చికిత్స అందించి తన తండ్రి సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

పాడుబడిన భవనం నుంచి పసికందు ఏడుపులు వినిపించడం

ఖుష్బూ ఆదివారం ఉదయం నడక కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్న పాడుబడిన భవనం నుంచి పసికందు ఏడుపులు వినిపించడంతో ఆమె తక్షణమే స్పందించారు. లోపలికి నేరుగా మార్గం లేకపోయినా ప్రహరీ దాటి వెళ్లి చిన్నారిని గుర్తించారు. పాపకు సుమారు 10 నెలల వయసుండగా, ముఖంపై గాయాలు ఉన్నట్లు తెలిపారు. తండ్రి జగదీశ్ పటానీతో కలిసి బరేలీలో నివసిస్తున్న ఖుష్బూ ప్రస్తుతం లెఫ్టినెంట్‌గా సాయుధ దళాల్లో సేవలందిస్తున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామనీ, త్వరలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సర్కిల్ ఆఫీసర్ పంకజ్ శ్రీవాస్తవ. ఖుష్బూ పటానీ చేసిన పనికి స్థానికులు, పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. ఆమె ధైర్యం, చొరవ మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

abandoned child Disha Patani's sister Google News in Telugu Khushboo Patani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.