Dhurandhar Netflix Telugu: థియేటర్లలో సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ ధురందర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించినది ఆదిత్య ధర్. విడుదలైనప్పటి నుంచి సినిమా మంచి టాక్‌తో ముందుకుసాగింది.
Read Also: Airtel-Adobe Offer: ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో రెండు నెలలకు పైగా (Dhurandhar Netflix Telugu) రన్ అయిన ఈ చిత్రం, జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించింది. హిందీతో పాటు తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి రావడం విశేషం.
కథ భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంతో సాగుతుంది. భారత ఇంటెలిజెన్స్ ఒక రహస్య మిషన్‌లో భాగంగా హంజా అలీ మజారీ అనే ఏజెంట్‌ను అండర్‌కవర్‌గా పాకిస్థాన్‌కు పంపుతుంది. అక్కడ అతడు సాధారణ యువకుడిగా జీవిస్తూ, క్రమంగా గ్యాంగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతని నిర్ణయాలు, ఎదురైన ప్రమాదాలు కథను ఉత్కంఠభరితంగా ముందుకు నడిపిస్తాయి.
మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. యాక్షన్, స్పై థ్రిల్లర్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ సినిమా థియేటర్‌లో మిస్ అయినవారు ఓటీటీలో తప్పకుండా చూడదగ్గ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: