📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dhurandhar Telugu Release : రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

Author Icon By Sai Kiran
Updated: December 18, 2025 • 7:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dhurandhar Telugu Release : రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్‌పై బలమైన చర్చ మొదలైంది.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ నటన, దర్శకుడు ఆదిత్య ధార్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే సౌత్ ఇండియా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.

Read Also: Gill Injury: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు శుభ్‌మన్ గిల్ దూరం

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ అంశంపై (Dhurandhar Telugu Release) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు నెటిజన్లు ట్విట్టర్ (X) వేదికగా మేకర్స్‌ను ట్యాగ్ చేస్తూ, “ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్ చేయాలి” అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక నెటిజన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

“#Dhurandhar ఒక శక్తివంతమైన సినిమా. దయచేసి దీనిని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేయండి. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాను అనుభవించే అవకాశం కలుగుతుంది” అంటూ అతను పోస్టు చేశాడు.

దీనిపై మరికొందరు స్పందిస్తూ, “అసలు ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాల్సింది. సౌత్‌లో కూడా భారీ ప్రేక్షకాదరణ దక్కేది” అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్ ట్రేడ్ వర్గాల వరకూ చేరడంతో, త్వరలోనే డబ్బింగ్ వెర్షన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Dhurandhar box office Dhurandhar dubbed version Dhurandhar movie update Dhurandhar South release Dhurandhar Telugu dub Dhurandhar Telugu release Dhurandhar Telugu Tamil Kannada Malayalam Google News in Telugu Latest News in Telugu Ranveer Singh Dhurandhar Ranveer Singh new movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.