బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం, కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. భారతదేశంలోనే రూ. 400 కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా, రణవీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించడం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. థియేటర్లలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్రం యొక్క ఓటీటీ విడుదలపై మళ్లింది.
Share Market: JK, CEAT, MRF టైర్ స్టాక్స్ షేర్లు లాభాల్లో
‘ధురంధర్’ డిజిటల్ రైట్స్ విషయంలో ఒక సంచలన ఒప్పందం జరిగినట్లు బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు రూ. 285 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డీల్ కంటే కూడా ఎక్కువని ప్రచారం జరుగుతుండటంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మేకర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా కథాంశం 1999 విమాన హైజాక్ మరియు 2001 పార్లమెంట్ దాడుల నేపథ్యంలో సాగుతుంది. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ప్లాన్ చేసిన ‘ఆపరేషన్ ధురంధర్’ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక యువకుడిని (రణవీర్ సింగ్) హమ్జా అనే పేరుతో సీక్రెట్ ఏజెంట్‌గా పాకిస్థాన్‌లోకి పంపి, అక్కడ ఉగ్రవాద మూలాలను ఎలా అంతం చేశారనేది చిత్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ బలోచ్ పాత్రకు, రణవీర్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాగా, ఈ కథలోని తదుపరి ఘట్టం ‘ధురంధర్ పార్ట్ 2’ రూపంలో వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com