📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Dhurandhar box office : పుష్ప-2 రికార్డులు బద్దలు.. ‘ధురంధర్’ సెన్సేషన్!

Author Icon By Sai Kiran
Updated: December 24, 2025 • 10:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dhurandhar box office : ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. మూడో వారంలోనూ వసూళ్ల జోరు తగ్గకపోవడంతో ఈ చిత్రం మరో కీలక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఒక్క రోజులోనే ఈ సినిమా రూ.17.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.589.50 కోట్లకు చేరాయి.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ మూడో వారం రికార్డును ‘ధురంధర్’ అధిగమించడం విశేషం. ‘పుష్ప 2’ మూడో వారం మొత్తం మీద రూ.103 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ‘ధురంధర్’ మూడో వారం తొలి నాలుగు రోజుల్లోనే రూ.111.75 కోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డు నెలకొల్పింది.

Read Also: Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!

అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.876.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్–1’ (రూ.852.31 కోట్లు) రికార్డును బద్దలుకొట్టింది. దీంతో 2025లో అత్యధిక (Dhurandhar box office) వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. రూ.900 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా ఈ సినిమా వేగంగా దూసుకెళ్తోంది.

మొదటి వారం రూ.207.25 కోట్లు, రెండో వారం రూ.253.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, మూడో వారం స్వల్ప తగ్గుదల తర్వాత మళ్లీ పుంజుకుంది. మంగళవారం నాటికి థియేటర్లలో ఆక్యుపెన్సీ 35.88 శాతంకు పెరగడం గమనార్హం.

అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా, పాకిస్థాన్‌లోని లియారి బలోచ్ గ్యాంగ్‌లోకి చొరబడే భారతీయ ఏజెంట్ ‘హంజా’ కథ చుట్టూ సాగుతుంది. ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు ఇప్పటికే ‘ధురంధర్ 2’ ను ప్రకటించారు. ఈ సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aditya Dhar film Bollywood action thriller Breaking News in Telugu Dhurandhar box office Dhurandhar collection Dhurandhar sequel announcement Dhurandhar third week collection Dhurandhar worldwide collection Google News in Telugu highest grossing Indian film 2025 Indian box office 2025 Latest News in Telugu Pushpa 2 Hindi record Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.