సినిమా ప్రపంచంలో సాధారణంగా ఏ చిత్రం అయినా ఒకటి, రెండు వారాలు థియేటర్లలో కొనసాగితేనే అది విజయం అని చెబుతారు. కానీ బాలీవుడ్ రొమాంటిక్ క్లాసిక్ ‘దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే (DDLJ)’ మాత్రం ఈ పరిమితిని చెరిపేసింది. ముంబైలోని ప్రసిద్ధ మరాఠా మందిర్ థియేటర్‌లో ఈ సినిమా 30 ఏళ్లుగా నిరంతరం ప్రదర్శితమవుతోంది.
Read also: Google Hub: ఆంధ్రలో గూగుల్ పెట్టుబడులపై రాజకీయ వాదన
1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమకథగా, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిలిచింది. “30సార్లు చూశా, ఇంకా చూస్తా” అంటూ 60 ఏళ్ల షక్రీ అనే అభిమాని చెప్పిన మాటలు ఈ సినిమా ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
రికార్డుల పరంపర – షోలేను కూడా అధిగమించింది
బాలీవుడ్ చరిత్రలో దీర్ఘకాలం థియేటర్లలో నడిచిన సినిమాగా 1975లో విడుదలైన ‘షోలే’ ఐదు సంవత్సరాల పాటు ప్రదర్శితమైంది. కానీ DDLJ ఆ రికార్డును కూడా అధిగమించింది. ఈ చిత్రం ఇప్పటికీ ముంబైలో ప్రతి ఉదయం 11:30 షోగా ప్రదర్శితమవుతూ, భారత సినీ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రదర్శన పొందిన చిత్రం అనే రికార్డు దక్కించుకుంది.
ప్రేక్షకుల తరతరాల మార్పు జరిగినా, DDLJకు వచ్చే ఆదరణ మాత్రం తగ్గలేదు. కొత్త తరం యువత కూడా ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమా కేవలం ప్రేమకథ కాదు, “ఇండియన్ వాల్యూస్‌తో మిళితమైన మోడ్రన్ లవ్ స్టోరీ” అని అభిమానులు చెబుతున్నారు.
ఎందుకు ప్రత్యేకం ఈ సినిమా?
- ఈ సినిమా షారుక్ ఖాన్(Shah Rukh Khan) కెరీర్లో మైలురాయి.
- కాజోల్ నటన, ఆదిత్య చోప్రా దర్శకత్వం అద్భుతంగా పొసిగాయి.
- ‘తుఝే దేఖా తో యే జానా సనం’ వంటి పాటలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి.
- విదేశాల్లో నివసించే భారతీయుల భావాలను హృదయానికి హత్తుకునేలా చూపింది.
DDLJ ఎప్పుడు విడుదలైంది?
1995 అక్టోబర్ 20న విడుదలైంది.
ఏ థియేటర్లో ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది?
ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: