📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Chiranjeevi : అనిల్ మూవీ లో చిరు పాత్ర పేరు అదేనా..?

Author Icon By Sudheer
Updated: June 19, 2025 • 7:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన అసలు పేరైన “కొణిదెల శివ శంకర వరప్రసాద్” (Konidela Shiva Shankar Varaprasad)పేరుతో తెరపై కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157 చిత్రంలో చిరంజీవి స్కూల్ డ్రిల్ మాస్టర్ శివ శంకర వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సూరీలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ పాఠశాల నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, చిరుతో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్నారు.

చిరు-నయనతార జోడీ మళ్లీ తెరపైకి

ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. గతంలో ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలలో నటించిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ముస్సూరీలోని షెడ్యూల్‌లో నయనతార, కేథరిన్ టేరీసా కూడా పాల్గొంటున్నారు. ఈ ఇద్దరితో పాటు ‘బలగం’ మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ లాంటి తారాగణం కూడా చిత్రంలో ఉన్నారు.

వినోదాత్మక అంచనాలతో భారీ ప్రాజెక్ట్

‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి విజయవంతమైన సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో మొదటి చిత్రం కావడంతో మెగా 157పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్‌కు ప్రసిద్ధి గాంచిన నటుడు. అలాంటి పాత్రలతోనే ఆయనకు బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిరు అభిమానులు ఈ సినిమాను ఒక వినోదభరితమైన మైలు రాయిగా భావిస్తున్నారు.

Read Also : Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి రిమాండ్

Anil ravipudi movie Chiranjeevi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.