మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే దర్శకుడు బాబీతో ఆయన చేయబోయే కొత్త సినిమాను వచ్చే నెలలో (ఫిబ్రవరి 2026) అధికారికంగా లాంచ్ చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం, ‘వాల్తేరు వీరయ్య’ను మించిన యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, బాబీ తన మార్కు కమర్షియల్ హంగులతో మెగాస్టార్‌ను కొత్తగా చూపించబోతున్నారని టాక్.
TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నేతలను డిస్టర్బ్ చేసేందుకే ఈ కుట్రలు
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, బాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అనురాగ్ కశ్యప్ తనదైన విలక్షణ నటనతో ఇప్పటికే దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఆయన భాగం కావడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఆయన పాత్ర చిరంజీవి పాత్రకు ధీటుగా ఉంటుందని, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక ఈ మూవీలో కాస్టింగ్ పరంగా కూడా బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి కూతురి పాత్ర చాలా కీలకమని, అందుకోసం టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి లేదా మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ మాస్ మూవీలో అంతర్లీనంగా ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ హీరోయిన్ ఎంపికపై మరియు ఇతర సాంకేతిక నిపుణులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com