Chiranjeevi box office record: మెగాస్టార్ Chiranjeevi హీరోగా, దర్శకుడు Anil Ravipudi దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి వారంలోనే ఈ చిత్రం రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రంగా వారం రోజుల్లో ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఏడో రోజు (జనవరి 18) ఒక్కరోజే రూ.31 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఏడవ రోజున ఇంతటి వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వారం ప్రారంభంలోనే రూ.300 కోట్ల మార్కును ఈ సినిమా దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?
దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లో కూడా ‘మన శంకర (Chiranjeevi box office record) వరప్రసాద్ గారు’ అదరగొడుతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు ఈ చిత్రం సుమారు 2.96 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో అక్కడ 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే తొలి చిత్రంగా ఇది నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఇది మరో ఘన విజయం. గత ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’తో వరుసగా రెండు సంవత్సరాల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలను అందించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి రికార్డు నెలకొల్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: