Chiranjeevi viral video : సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా దూసుకుపోతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, రూ.300 కోట్ల క్లబ్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ ఇద్దరినీ సమానంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.
సినిమాలో చిరంజీవి వింటేజ్ కామెడీ, యాక్షన్‌తో (Chiranjeevi viral video) పాటు ఆయన డ్యాన్స్ మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఒక పాటలో చిరు వేసిన హుక్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ ఆ స్టెప్‌ను అనుకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు.
Read also: Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు
ఇటీవల ఇద్దరు బామ్మలు మొబైల్ ఫోన్ లైట్ వేసుకుని చిరు హుక్ స్టెప్‌ను ఉత్సాహంగా చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. “డ్యాన్స్‌కు వయసుతో పని లేదు” అంటూ నెటిజన్లు వారి ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో చిరంజీవి స్టెప్పుల ప్రభావం ఏ స్థాయిలో ఉందో మరోసారి చూపిస్తోంది.
ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి కాగా, చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించగా, భీమ్స్ సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: