Buchibabu : పెద్ది డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా ?

Read Time:  1 min
Buchibabu : పెద్ది డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా ?
FONT SIZE
GET APP

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా, తన తదుపరి ప్రాజెక్టు విషయంలో రూటు మార్చినట్లు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తవానికి బుచ్చిబాబు తన రెండో సినిమానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (తారక్)తో చేయాల్సి ఉంది, కానీ స్క్రిప్ట్ పరంగా కొన్ని మార్పుల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం చరణ్ సినిమా క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో, బుచ్చిబాబు తన మూడో సినిమా ఎవరితో చేయాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు మరియు ‘దేవర-2’తో బిజీగా ఉండటం వల్ల, ఆయన డేట్ల కోసం ఏడాదిన్నరకు పైగా వేచి చూడాల్సి ఉంటుంది. దీంతో అంత కాలం ఖాళీగా ఉండటం ఇష్టం లేని బుచ్చిబాబు, మరో హీరోతో సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

తాజా సమాచారం ప్రకారం, బుచ్చిబాబు అక్కినేని కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారని, అక్కినేని అఖిల్ హీరోగా ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే బుచ్చిబాబు ఒక వైవిధ్యమైన ప్రేమకథను రాసుకున్నారని, దానిని ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మార్చి అఖిల్‌కు సరిపోయేలా తీర్చిదిద్దినట్లు వినికిడి. ఈ విషయంలో కింగ్ నాగార్జున స్వయంగా చొరవ తీసుకుని చర్చలు జరిపారని, స్క్రిప్ట్ నచ్చితే ఈ కాంబినేషన్ ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న అఖిల్ కెరీర్‌కు, ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు సినిమా కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.