Bookie teaser: ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత Vijay Antony నిర్మాణంలో తెరకెక్కుతున్న 18వ చిత్రం Bookie తమిళ్ ప్రోమో విడుదలైంది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ (VAFC) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ ప్రోమోను జనవరి 19, 2026న విజయ్ ఆంటోనీ స్వయంగా విడుదల చేయడం విశేషం.
ఈ సినిమాతో అజయ్ ధిషన్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన విజయ్ ఆంటోనీ అక్క కుమారుడు. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అజయ్, ‘మార్గన్’ సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించారు. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
‘బూకీ’ చిత్రానికి గణేష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా ఆర్‌కే ధనుషా నటిస్తున్నారు. ఈ సినిమా కథ జెన్-జీ / 2కే తరం యువత మధ్య ప్రేమ, రిలేషన్‌షిప్స్, భావోద్వేగ సమస్యల చుట్టూ తిరుగుతుంది. వీటిని సరదా కామెడీ, న్యూ ఏజ్ టేక్‌తో చూపించనున్నారు.
Read Also: WPL 2026: ముంబై పై ఢిల్లీ గెలుపు
ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి (Bookie teaser) మణికందన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో ప్రత్యేక క్యామియోలో మెరవనున్నారు. ఈ సినిమాకు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను విజయ్ ఆంటోనీనే నిర్వహించడం మరో హైలైట్.
తమిళం, తెలుగులో ఒకేసారి రూపొందిన ‘బూకీ’ సినిమాను యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా, ముఖ్యంగా వాలెంటైన్స్ డే ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: