James Cameron Avatar 3 : చైనా బాక్సాఫీస్‌లో ప్రీ–సేల్స్ దశలోనే దూకుడు చూపిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా హాలీవుడ్ చిత్రాల్లో మరో కీలక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే Jurassic World Rebirth ప్రీ–సేల్స్ కలెక్షన్లను దాటేసి, 2025లో చైనాలో రెండో అతిపెద్ద హాలీవుడ్ ప్రీ–సేల్స్ చిత్రంగా నిలిచింది.
ట్రేడ్ అనలిస్ట్ లూయిజ్ ఫెర్నాండో వెల్లడించిన వివరాల ప్రకారం, జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన Avatar 3 (Fire and Ash) చైనాలో ప్రీ–సేల్స్ ద్వారా మూడో రోజుకే 5 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. డిసెంబర్ 17 నుంచి 21 మధ్య మూడు రోజుల్లోనే ఈ సినిమా 5.4 మిలియన్ డాలర్ల ప్రీ–సేల్స్ కలెక్షన్ సాధించింది. ఇంకా థియేటర్లలో విడుదలకు మూడు రోజులు మిగిలి ఉండడం విశేషం.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఇప్పటికే ఈ సినిమా, స్కార్లెట్ జోహాన్సన్ నటించిన Jurassic World Rebirth ప్రీ–సేల్స్ రికార్డును అధిగమించింది. ఆ చిత్రం చైనాలో ప్రీ–సేల్స్ ద్వారా 3.9 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగా, Avatar: Fire and Ash ఆ మొత్తాన్ని కేవలం మూడు రోజుల్లోనే దాటేసింది.
ప్రస్తుతం 2025లో చైనాలో హాలీవుడ్ సినిమాల (James Cameron Avatar 3 ) ప్రీ–సేల్స్‌లో Zootopia 2 తర్వాత రెండో స్థానంలో Avatar: Fire and Ash కొనసాగుతోంది. ఈ స్థాయి స్పందనతో, సినిమా విడుదలైన తర్వాత మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: