ar rahman controversy : ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు A. R. Rahman ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు మత వివక్ష కోణంలో తప్పుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో రెహమాన్ తాజాగా స్పందిస్తూ తన ఉద్దేశాన్ని స్పష్టంచేశారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన వీడియోలో, తాను ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని తెలిపారు. తన వ్యాఖ్యలను (ar rahman controversy) కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, వాస్తవానికి తాను సంగీతం ద్వారానే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తానని అన్నారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని, భారత్ తనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయక దేశమని పేర్కొన్నారు.
Read also: Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు
తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. సంగీతమే తన జీవితం అని, ఎలాంటి మతం లేదా వ్యక్తుల పట్ల ద్వేషం తన మనసులో లేదని రెహమాన్ స్పష్టం చేశారు. భారతదేశమే తన ఇల్లు, గురువు అని చెప్పడం ద్వారా తన దేశభక్తిని మరోసారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గినట్లు అనిపిస్తోందని చెప్పారు. ఇందుకు పలు కారణాలు ఉండవచ్చని, కానీ ఎవరూ నేరుగా తనతో చెప్పలేదని తెలిపారు. తన మాటలను మతపరమైన కోణంలో మలచడం సరైంది కాదని ఆయన తాజా వీడియో ద్వారా స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: