టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ Anil Ravipudi శుక్రవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మెగాస్టార్ Chiranjeevi హీరోగా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామివారికి కృతజ్ఞతగా మొక్కులు చెల్లించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై రూ.360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి, తన తదుపరి సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయని, మరో 10 నుంచి 15 రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తానని తెలిపారు. దీంతో ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
Read also : Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి అనిల్ రావిపూడి విక్టరీ Venkatesh తో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది మల్టీస్టారర్‌గా తెరకెక్కే ఛాన్స్ ఉండగా, తమిళ స్టార్ Karthi లేదా మలయాళ నటుడు Fahadh Faasil కీలక పాత్రలో కనిపించవచ్చని ప్రచారం సాగుతోంది. ఈసారి పూర్తిగా కొత్త జానర్‌లో సినిమా తీసేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: