Akhanda 2 box office impact : టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ ‘అఖండ 2’ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను చివరి నిమిషంలోనే వాయిదా వేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంతో అభిమానుల్లో నిరాశ, ఆగ్రహం వ్యక్తమవుతోంది.
స్టార్ హీరో బాలయ్య నటించిన సినిమా ఇలా అకస్మాత్తుగా వాయిదా పడటం ఏంటని సోషల్ మీడియాలో పలువురు అభిమానులు, సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని సాంకేతిక, లాజిస్టిక్ సమస్యల కారణంగానే విడుదలను వాయిదా వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాతే సినిమాను రిలీజ్ చేయాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న దశలోనే ఆగిపోయిన ‘అఖండ 2’ ఎప్పుడు (Akhanda 2 box office impact) ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వాయిదా వల్ల సినిమా పైన అంచనాలు తగ్గుతాయా? లేదా మరింత హైప్ పెరుగుతుందా? రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: