దక్షిణాదిలో సినీ తారల(Cine Stares )పై అభిమానమే కాదు, ఆరాధన స్థాయిలో ఉండే క్రేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది నటులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడంతో వారి పాపులారిటీ మరింత పెరిగింది. సినిమాల్లో మాత్రమే కనిపించే సెలబ్రిటీలు ఇప్పుడు రాజకీయ నాయకులుగా సభలు, రోడ్‌షోలు నిర్వహించడం వల్ల వారిని ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ ఆరాధనలో నియంత్రణ లేకపోవడం, భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
ఇటీవల కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన దీనికి జ్వలంత ఉదాహరణ. స్టార్ నేతను ఒకసారి కంటికి కనిపించుకోవాలన్న ఆత్రంతో వేలాది మంది ఒకేచోట చేరి, ఒకరినొకరు తోసుకోవడం వల్ల ప్రాణనష్టాలు సంభవించాయి. అభిమానులు తమ మోజులో క్యూలైన్‌లు, భద్రతా నియమాలను పట్టించుకోకుండా ముందుకు దూకడం వల్ల చిన్నారులు, మహిళలు ప్రాణాలను కోల్పోవడం ఎంత దురదృష్టకరమో గుర్తించాలి. ఈ రకమైన సంఘటనల్లో తప్పు ఎవరిదో అనడం కష్టం అయినప్పటికీ, నియంత్రణ కోల్పోయిన అభిమానుల ప్రవర్తన కూడా ప్రధాన కారణం అవుతుంది.
Latest News: Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్..సెల్ఫీ స్టిక్, టపాసులపై నిషేధం?
ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే – ఏ హీరో, ఏ నేతా, ఏ సెలబ్రిటీ మీకోసం ప్రాణం పెట్టడు. మీ ప్రాణం మీకే విలువైనది. అభిమానమే కానీ, మితిమీరిన ఆరాధన మాత్రం ప్రమాదకరం. నియంత్రణలో ఉండే ఉత్సాహమే నిజమైన అభిమానమని గుర్తించాలి. సభలు, రోడ్‌షోలు, ఫంక్షన్‌లకు వెళ్లేటప్పుడు క్రమశిక్షణ పాటించడం, భద్రతా సూచనలు అనుసరించడం, పిల్లలను రిస్క్‌లో పెట్టకపోవడం ప్రతి అభిమాని కర్తవ్యం. అప్పుడే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావు.