📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాట..బాలుడి పరిస్థితి విషమం

Author Icon By Sudheer
Updated: December 4, 2024 • 11:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ల వద్ద చేరుకున్నారు. కాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో ఓ బాలుడికి ఉపిరిడక స్పృహ తప్పిపడిపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు బాలుడ్ని దగ్గరలోని హాస్పటల్ లో జాయిన్ చేసారు. ఈ బాలుడి ఎవరు..? ఎక్కడి నుండి వచ్చాడు..? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.ఈరోజు రాత్రి 9.30 త‌ర్వాత పుష్ప 2 ప్రీమియ‌ర్స్ మొదలయ్యాయి. దాదాపు 3 ఏండ్ల త‌ర్వాత అల్లు అర్జున్ సినిమా థియేట‌ర్లో విడుద‌ల కానుడటంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. అయితే న‌టుడు అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్ర‌ముఖులు పలు థియేటర్స్ లలో ప్రీమియర్ షోస్ చూస్తున్నారు.

అల్లు అర్జున్‌తో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన వారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో సినిమా చూస్తున్నాడు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నల్లగండ్లలోని అపర్ణలో, ఏషియ‌న్ మ‌హేశ్ బాబు థియేట‌ర్‌లో మైత్రీ మేకర్స్ నిర్మాతలు , దిల్ రాజు, అనిల్ రావిపూడి త‌దిత‌రులు శ్రీరాములు థియేట‌ర్‌లో సినిమా చుస్తున్నట్లు స‌మాచారం. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్‌తో పాటు అత‌డి సన్నిహితులు అమీర్‌పేటలోని ఏషియ‌న్ అల్లు అర్జున్ సినిమాస్‌లో చూస్తున్నట్లు తెలుస్తుంది.

pushpa 2 RTC x road sandhya theatre Stampede at Pushpa 2 premiere show

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.