Robert Vadra : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేశారు. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు పంపారు. అయితే, ఈ కేసులో ఏప్రిల్ 8న మొదటిసారి జారీ చేసిన సమన్లును వాద్రా దాటవేయడంతో.. ఇప్పుడు రెండోసారి జారీ చేశారు.

అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తా
ఈక్రమంలోనే మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందిన అనంతరం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. నేను ప్రజలపక్షాన గొంతు వినిపించిన ప్రతీసారీ.. వాళ్లు నన్ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని రాబర్ట్ పేర్కొన్నారు.
శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు
కాగా, వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అనంతరం ఈ భూమిని వాద్రా కంపెనీ రూ.58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో విచారణకు రావాల్సిందిగా వాద్రాను ఈడీ ఆదేశించింది.
Read Also: అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ