జీ7 (G7) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) హాజరుకావడం పట్ల కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Canada PM Mark Carney ) హర్షం వ్యక్తం చేశారు. “మీరు ఇక్కడికి రావడం గర్వకారణం. ఇది మీ నాయకత్వ శైలి, మీ దేశ ప్రాముఖ్యతకు నిదర్శనం,” అని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం తీసుకుంటున్న నాయకత్వ భూమికను మార్క్ కార్నీ ప్రశంసించారు. జీ7 సదస్సులో భాగంగా మోదీ పాల్గొనడం ఒక గౌరవ విషయమని కెనడా ప్రధాని అభిప్రాయపడ్డారు.
విభిన్న అంశాలపై మోదీ పాత్ర
ఈ సమావేశంలో ఇంధన భద్రత, శుద్ధ ఇంధన పరివర్తన, భవిష్యత్తుకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సమస్యలపై సమగ్రంగా పరిష్కారాలు కనుగొనడానికి మోదీ వంటి నేతల ఉనికిని కెనడా ప్రధాని కీలకంగా పేర్కొన్నారు. “ఈ అంశాలపై మనం కలిసి పని చేయాలన్న ఆవశ్యకత ఉంది” అంటూ ఆయన చెప్పారు.
భారత ప్రాముఖ్యతపై అంతర్జాతీయ గుర్తింపు
ఈ వ్యాఖ్యలు భారతదేశానికి కలుగుతున్న అంతర్జాతీయ గుర్తింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఒక ప్రధాన పాత్రధారిగా మారుతోంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో భారత్ వాణిజ్యం, కూటములు, సాంకేతికత, భద్రత, శాంతి అంశాలలో కీలకంగా మారిన నేపధ్యంలో మోదీకి వచ్చిన ఆహ్వానం, అందిన గౌరవం దేశ ప్రజలకు గర్వకారణం. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి విదేశీ నేతల నుంచి వస్తున్న ప్రశంసలు భారత్ విశ్వవ్యాప్త ప్రతిష్టను ప్రతిబింబిస్తున్నాయి.
Read Also : YS Jagan Palnadu Tour : జగన్ పల్నాడు పర్యటనపై వివాదం ఎందుకు?