ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ ఎన్. రెడ్డిపాటి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు నుండి బిగ్ రిలీఫ్ లభించింది. ఇప్పటికే ఈ స్కాంలో పలువురు కీలకులు విచారణకు లోనవుతుండగా, మిథున్ రెడ్డి అరెస్ట్ కానున్నారన్న ఊహాగానాలు బలంగా వెలువడుతున్న సమయంలో అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు రాజకీయంగా, చట్టపరంగా పెద్ద మార్గదర్శకంగా మారాయి.

ఏం జరిగింది? – కేసు నేపథ్యం
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయంటూ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) కేసును నమోదు చేసింది. ప్రభుత్వ సంచాలిత ద్వారా మద్యం సరఫరాలో అక్రమ కాంట్రాక్టులు, అధిక ధరలకు కొనుగోళ్లు, అవినీతిపరమైన లావాదేవీలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఇప్పటికే మాజీ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపార భాగస్వాములు పలువురు నిందితులుగా నమోదు అయ్యారు. అయితే, ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో నేరుగా లేనప్పటికీ, ఆయనపై సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. విచారణలో ఆయనపై కూడా నేరపూరిత పాత్ర ఉందని భావిస్తూ, అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. తనపై అభియోగాలు రాకముందే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అతని పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదు కనుక ముందస్తు బెయిల్ ఎలా ఇవ్వగలం? అంటూ హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దీనితో పరిస్థితి తీవ్రతరమవుతుందని అంచనా వేసిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈరోజు మిథున్ రెడ్డి పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని CIDకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది మిథున్ రెడ్డికి తాత్కాలికంగా ఎంతో ఊరట కలిగించినా, కేసు పూర్తిగా ముగిసినట్టు మాత్రం కాదు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో వైసీపీ శిబిరం లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపై వస్తున్న విమర్శల్ని వ్యతిరేకించేందుకు ఈ తీర్పు ఓ ఆయుధంగా మారనుంది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఇది తాత్కాలిక ఊరట మాత్రమే మద్యం స్కాంలో మిథున్ పాత్ర బయటపడుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.
Read also: Sharmila: వైద్య సేవలపై కూటమికి షర్మిల వార్నింగ్