ప్రపంచం దృష్టి మొత్తం ఇప్పుడు అగ్రరాజ్యంపై పడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ట్రంప్ హయాంలో క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యం ఉంటుందని అమెరికా మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ట్రంప్ తన సొంత క్రిప్టో కరెన్సీని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ సతీమణి, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా సొంతంగా ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్‌ను పరిచయం చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రోజు అంటే ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) సాయంత్రం ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరుతో విక్టరీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జరుగుతున్న సమయంలో తాను ఓ మీమ్ కాయిన్‌ను విడుదల చేస్తున్నట్లు మెలానియా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

మరోవైపు ట్రంప్ టోకెన్ మార్కెట్లో దుమ్మురేపుతోంది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే దీని విలువ అమాంతం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. లాంచ్ అయిన మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 300 శాతం పెరిగి క్రిప్టో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోందని టాక్. ఇక మెలానియా క్రిప్టో కాయిన్ విడుదల చేసిన తర్వాత ట్రంప్ టోకెన్ విలువ భారీగా పడిపోయినట్లు యూఎస్ మీడియా పేర్కొంటోంది.పేరుతో ఈ మీమీకాయిన్‌ను పరిచయం చేశారు.