Samsung introduced the personal health records feature in the Samsung Health app

ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

గురుగ్రామ్ : భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయపడటానికి సామ్‌ సంగ్ హెల్త్ యాప్‌లో హెల్త్ రికార్డ్స్ ఫీచర్‌ను జోడించినట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) ను నేరుగా సామ్‌సంగ్ హెల్త్ మొబైల్ యాప్ ద్వారా సృష్టించి యాక్సెస్ చేయడానికి హెల్త్ రికార్డ్స్ ఫీచర్ వీలు కల్పిస్తుంది. భారతదేశం అంతటా ఆరోగ్య సంరక్షణ సంస్థలు రూపొందించే తమ ఆరోగ్య డేటాను వినియోగదారులు ఇప్పుడు సులభంగా నిర్వహించ వచ్చు. ఇది వ్యక్తులు తమ వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను నిర్వహించే విధానాన్ని మారుస్తుంది.

దేశ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌తో సజావైన, సురక్షితమైన ఏకీకరణను అందించడం ద్వారా తన వినియోగదారు లకు సాధికారత కల్పించడానికి సామ్‌సంగ్ చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ప్రాజెక్ట్‌తో అనుసంధానించబడింది.

image

‘‘సామ్‌సంగ్ కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది. వారి రోజువారీ అనుభవాలను మెరుగుపరచడానికి ఉత్ప త్తులు, సేవలను నిరంతరం మెరుగుపరుస్తుంది. భారతదేశానికి సంబంధించి సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో హెల్త్ రికార్డ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం అనేది డిజిటల్ హెల్త్ రికార్డులకు అనుకూలమైన యాక్సెస్‌ను అందించడానికి, వైద్యులు లేదా కేర్‌టేకర్లతో ఎప్పుడైనా సురక్షితమైన రీతిలో డేటా షేరింగ్‌ను ఎనేబుల్ చేయడానికి మాకు గల అంకితభావాన్ని చాటిచెబుతుంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ ఆరోగ్య చరిత్రను నిర్వహించడానికి, పురో గతిని ట్రాక్ చేయడానికి, తమ శ్రేయస్సుపై మెరుగైన నియంత్రణను కొనసాగించడానికి సాధికారికతను ఇస్తుం ది’’ అని నోయిడాలోని సామ్‌సంగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ అన్నారు.

భారతదేశంలోని ప్రముఖ ఏబీడీఎం సర్టిఫైడ్ ఇంటిగ్రేటర్ అయిన ఎకా కేర్ తో సామ్‌సంగ్ లోని ఆర్ అండ్ డి, యూఎక్స్ డిజైన్ మరియు కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్ బృందాల సహకార ప్రయత్నం ఫలితంగా హెల్త్ రికార్డ్స్ ఫీచర్ ఏర్పడింది. ఈ ఫీచర్‌తో, వినియోగదారులు తమ ఆధార్ లేదా మొబైల్ ఫోన్ నంబర్‌లతో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో ఏబీహెచ్ఏ ఖాతా కోసం నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత, వారు ప్రిస్క్రిప్షన్‌లు, ల్యాబ్ ఫలితాలు, ఆసుపత్రి సందర్శనలు, మరిన్నింటితో సహా వారి వైద్య చరిత్రను చూసుకునేందుకు యాక్సెస్ పొందుతారు – అన్నీ వారి ప్రత్యేకమైన ఏబీహెచ్ఏ ఐడీలకు సురక్షితంగా లింక్ చేయబడ్డాయి.

‘‘సామ్‌సంగ్‌తో ఈ భాగస్వామ్యం పట్ల ఎకా కేర్‌లో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇది భారతదేశం అంతటా ఏబీడీఎం స్వీకరణను గణనీయంగా వేగవంతం చేస్తుంది. దేశంలో మరింత అనుసంధానించబడిన, సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు” అని ఎకా కేర్ సహ వ్యవస్థాపకుడు దీపక్ తులి అన్నారు.

డిజిటలైజేషన్ శక్తిని ఉపయోగించడం ద్వారా భారతీయులు తమ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ నిర్వహణ తీరు తెన్నులను విప్లవాత్మకంగా మార్చడమే సామ్‌సంగ్ లక్ష్యం. వినియోగదారులు ఇప్పుడు తమ ఆరోగ్య రికార్డు లను ఏబీడీఎం సర్టిఫైడ్ సెక్యూర్ హెల్త్ లాకర్లలో సురక్షితంగా నిల్వ చేయవచ్చు, గజిబిజిగా ఉండే కాగితాల భారం పడకుండా ఉండవచ్చు. అంతేగాకుండా, ఏబీడీఎం అనుగుణ్య ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఓపీడీ సందర్శనల సమయంలో, వినియోగ దారులు వర్చువల్ క్యూ టోకెన్‌ను పొందడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి సామ్‌సంగ్ హెల్త్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.

సామ్‌సంగ్ హెల్త్ యాప్ మందుల నిర్వహణ, నిద్ర పర్యవేక్షణ, మైండ్‌ఫుల్‌నెస్ ప్రోగ్రామ్‌లు మరియు క్రమరహిత హృదయ స్పందన నోటిఫికేషన్‌లతో సహా సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తుంది. సామ్‌సంగ్ పరికరాలలోని అన్ని సామ్‌సంగ్ హెల్త్ యూజర్ డేటా డిఫెన్స్-గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సురక్షితం చేయబడింది. భారతీయ వినియోగదారులు సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్‌లోని సామ్‌సంగ్ హెల్త్ తాజా యాప్ అప్‌డేట్‌లలో కొత్త హెల్త్ రికార్డ్స్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

Related Posts
ఏపీలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
Establishment of 63 new can

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా 63 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా Read more

రాజ‌మండ్రిలో గ్రాండ్‌గా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్
game changer Pre Release event grand success

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా Read more

విజయ్ దేవరకొండ విడి12 అందరినీ షాక్‌ చేస్తుంది: నాగ వంశీ
విజయ్ దేవరకొండ విడి12 అందరినీ షాక్‌ చేస్తుంది: నాగ వంశీ

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘విడి12’ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల Read more

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా తేదీ. 9.12.2024 కార్యక్రమాలు
victory celebrations cultural programmes

ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల సందర్భంగా తేదీ. 9.12.2024 కార్యక్రమాలు •ముఖ్యమంత్రి చే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ - 5.00 PM – సచివాలయంలో. •బహిరంగ Read more