Manchu Vishnu రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీకి వెళ్లలేకపోయా మంచు విష్ణు

Manchu Vishnu: రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీకి వెళ్లలేకపోయా: మంచు విష్ణు

Manchu Vishnu: రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీకి వెళ్లలేకపోయా: మంచు విష్ణు టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన లేటెస్ట్ మూవీ “కన్నప్ప” ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అంతేకాదు, గత ఏడాది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి తాను ఎందుకు హాజరుకాలేకపోయానో కూడా వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలవలేకపోయాను – కారణం మాత్రం వ్యక్తిగతం

ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హాజరుకాలేకపోయిన కారణాన్ని మంచు విష్ణు వివరించారు. ఆ సమయంలో నా ఫ్యామిలీ ఈవెంట్ ఉండటంతో హాజరుకాలేకపోయాను అని ఆయన స్పష్టంచేశారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమూ చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.”కన్నప్ప” చిత్రంలోని ఓ లవ్ సాంగ్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించిన జర్నలిస్ట్‌కు మంచు విష్ణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నేను సినిమా తీస్తున్నా, డాక్యుమెంటరీ కాదు. ఇది కమర్షియల్ సినిమా. అందులోని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ని తప్పుబట్టడం సరికాదు” అని వ్యాఖ్యానించారు.అంతేకాదు, “రెండో శతాబ్దంలో ప్రజలు ఎలా జీవించారో ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ, కొంతమంది విమర్శించాల్సిందేననే ఉద్దేశంతోనే చూస్తారు అని ఘాటుగా స్పందించారు. గతంలో శివుడిపై రూపొందించిన పాటలను కూడా కొందరు విమర్శించారని, అలాంటి రియాక్షన్లు చూసి తాను నవ్వుకుంటానని తెలిపారు.

కన్నప్ప కోసం భారీ రిస్క్ తీసుకున్నా–మంచు విష్ణు

సినిమా బడ్జెట్, ఓటీటీ డీల్ గురించి మాట్లాడిన విష్ణు, నేను పెట్టిన బడ్జెట్‌కు ఓటీటీలో అమ్మలేను. కానీ మా మార్కెటింగ్ స్ట్రాటజీస్ బలంగా ఉన్నాయి”అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ సినిమా నా కెరీర్‌లోనే అతిపెద్ద రిస్క్. కానీ, ఇది భక్తి చిత్రం కావడంతో మొత్తం భారం శివుడిపైనే వేశాను” అని చెప్పారు. మంచు విష్ణు ఇప్పటికే భారీ బడ్జెట్‌తో “కన్నప్ప” తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విమర్శలు, చర్చలు ఎంత జరిగినా విష్ణు మాత్రం తన సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి, “కన్నప్ప” బాక్సాఫీస్ వద్ద ఎలా విజయం సాధిస్తుందో చూడాలి!

Related Posts
పుష్ప 2 సినిమాపై వెంకటేశ్ రివ్యూ
venkatesh allu arjun

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్‌ను కల్లోలపరుస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా విపరీతమైన వసూళ్లతో వేగంగా 1000 కోట్ల Read more

పోసానిపై న్యాయపోరాటం చేస్తామన్న అంబటి
పోసానిపై న్యాయపోరాటం చేస్తామన్న అంబటి

పోసానిపై న్యాయపోరాటం చేస్తామన్న అంబటి సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోని పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా గుంటూరు జైలు నుంచి తరలించడం పట్ల వైసీపీ నేత Read more

స్టార్ హీరో బిచ్చగాడిలా మారడానికి అసలు కారణం ఇదే
స్టార్ హీరో బిచ్చగాడిలా మారడానికి అసలు కారణం ఇదే

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజాగా ముంబై వీధుల్లో బిచ్చగాడి వేషంలో కనిపించాడు. అతని ఈ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ Read more

RC16 షూటింగ్ స్పాట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్!
RC16 షూటింగ్ స్పాట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్!

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న RC16 చిత్రం షూటింగ్ ప్రదేశంలో ఓ ప్రత్యేక అతిథి సందడి చేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా Read more