మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దేవాలయాన్ని క్లీన్ చేస్తుండగా, పక్కన ఉన్న స్తంభం యొక్క సపోర్ట్ వైర్ తగిలి గ్రామానికి చెందిన కిచ్చయ్య గారి మాధవరెడ్డి (73) విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు.
మృతుడు మాధవరెడ్డి
మృతుడు మాధవరెడ్డి అతని భార్య భారతమ్మ. ప్రతిరోజు దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటారు. సుమారు 15 సంవత్సరాలుగా ఇద్దరు దంపతులు హనుమాన్ దేవాలయానికి సేవ చేస్తూ జీవనం గడుపుతుంటారు.
భార్య భారతమ్మ రోదనలు
ఈరోజు ప్రమాదవశాత్తు ఇలా మాధవరెడ్డి మృత్యువాత పడడంతో భార్య భారతమ్మ రోదనలు మిన్నంటాయి.
కుటుంబ సభ్యులు
ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదులో ఉంటారు.
ఉగాది పర్వదినంలో విషాదం
ఉగాది పర్వదినాన గ్రామంలో ఇలా దేవాలయం ఆవరణలో వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.