tigala krishnareddy

చంద్రబాబు ను కలిసిన బిఆర్ఎస్ నేతలు

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిలు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తీగల..తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపాడు. సోమవారం జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు సైతం ఉన్నారు.

ఈ సందర్బంగా తీగల తాను టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంద‌ని గుర్తు చేసిన ఆయ‌న‌… హైద‌రాబాద్ అభివృద్ధి చేసింది వంద‌కు వంద‌శాతం చంద్ర‌బాబేన‌ని అన్నారు. తెలంగాణ‌లో టీడీపీ పాల‌న మ‌ళ్లీ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

ఇక చంద్ర‌బాబును క‌లిసిన మ‌ల్లారెడ్డి త‌న‌ మ‌న‌వ‌రాలు శ్రేయ‌రెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, తీగ‌ల కృష్ణారెడ్డి టీడీపీలో ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీని వీడారు. మ‌ల్లారెడ్డి మ‌న‌వ‌రాలు పెళ్లి కార‌ణంగా చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ అధినేత‌ను క‌లిశారు.

Related Posts
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితుల‌కు బెయిల్!
allu

న‌టుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్ప‌డిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బ‌న్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, Read more

ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయం – షర్మిల
ys sharmila

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు Read more

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.
lbnagar wall collapse

ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగాపైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి Read more

Telanagana Budget: గ్యారంటీలకు నిధులు లేవు కేటీఆర్
KTR :తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ అసంతృప్తి తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏ ఒక్క రంగానికీ Read more