Mamata Banerjee సుప్రీం తీర్పుపై మమతా బెనర్జీ ఫైర్

Mamata Banerjee : సుప్రీం తీర్పుపై మమతా బెనర్జీ ఫైర్

పశ్చిమ బెంగాల్‌లో 25,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు రద్దైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఈ ఉదంతం మరింత వేడెక్కింది. ఈ తీర్పుతో బాధిత ఉపాధ్యాయులు కంటతడి పెట్టగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ తీర్పును తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. “నన్ను జైలులో పెట్టినా సరే… అయినా ఈ తీర్పును అంగీకరించను,” అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా మాట్లాడడం కోర్టు ధిక్కారంగా పరిగణించవచ్చని అంగీకరించినప్పటికీ, ఉద్యోగాల రద్దును తాను ఒప్పుకోలేనని తేల్చిచెప్పారు.

Advertisements
Mamata Banerjee సుప్రీం తీర్పుపై మమతా బెనర్జీ ఫైర్
Mamata Banerjee సుప్రీం తీర్పుపై మమతా బెనర్జీ ఫైర్

“నా హయాంలో ఎవరూ ఉద్యోగం కోల్పోరు”

“నేను బతికినంత కాలం ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఉద్యోగం కోల్పోడు,” అని మమతా ధీమాగా చెప్పారు. ఉపాధ్యాయుల న్యాయంగా సంపాదించిన ఉద్యోగాలను రక్షించడమే తన మొదటి బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగులను కాపాడే బాధ్యతను తానొక తల్లిగా తీసుకుంటానని భావోద్వేగంతో తెలిపారు.”నన్ను సవాల్ చేసే వారికి సమాధానం చెప్పే శక్తి నాకుంది,” అంటూ ప్రత్యర్థులపై ఘాటుగా విరుచుకుపడ్డారు. రాజకీయంగా తమను బలహీనపరిచేందుకు ఇదంతా కుట్రగా మమత అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు వెనుక ఉన్న లక్ష్యం రాజకీయ ప్రయోజనాలేనని ఆమె వ్యాఖ్యానించారు.
ఉద్యోగాలు కోల్పోతామన్న ఆందోళనతో ఉపాధ్యాయులు నిరాశలో మునిగిపోతుండగా, మమత బెనర్జీ ఇచ్చిన హామీ వారికి కొంత ఊరట ఇచ్చింది. “మీరు నన్ను నమ్మండి. మీతో ఉన్నాను,” అంటూ మమత భావోద్వేగంగా మాట్లాడారు.

అప్పటి తీర్పుకు వ్యతిరేకంగా లీగల్ ఫైట్?

ఇక బెంగాల్ ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టాలని సుప్రీం సూచించినా, మమత బెనర్జీ ప్రభుత్వ దిశ వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును మరోసారి రివ్యూ పిటిషన్ ద్వారా తిరగదోదాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఈ పరిణామాలు చూస్తుంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరో మలుపు తిప్పేలా ఉన్నాయి. మమత బెనర్జీ ఓవైపు న్యాయస్థాన నిర్ణయాన్ని ఎదుర్కొంటూ, మరోవైపు ఉద్యోగుల్ని ఆదుకునే యోచనలో ఉండటం గమనార్హం.

Read Also : Rahul Gandhi: యువతకు ఉపాధి కల్పించిన రాహుల్ గాంధీ

Related Posts
నిరుద్యోగులకు ఈ జీరో పన్నుతో కలిగే ప్రయోజనం ఏమిటి? : శశిథరూర్‌
What is the benefit of this zero tax for the unemployed? : Shashi Tharoor

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ Read more

తిరుపతిలో టోకెన్లు ఇస్తున్న సంగతి కూడా నాకు తెలియదు – సీఎం చంద్రబాబు
cbn pm

తిరుపతిలో సంభవించిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం Read more

రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
Revanth govt key decision on rythu bharosa?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక Read more

ముంబైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్
sachin vote

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×