Maharashtra and Jharkhand elections will be held today

నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు మోగనున్న నగారా

న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 నిముషాలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది.

దీనికి సంబంధించిన ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది. కాగా.. అనధికారిక సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావలితో పాటు ఝార్ఖండ్‌లో ప్రధాన పండగైన ఛఠ్ పూజ, దేవి దీపావళి పండుగలు కూడా వరుసగా ఉండడంతో ఇవి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నవంబర్ రెండో వారంలో లేదా మూడో వారంలో ఓటింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా మరో 45 ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలకు కూడా మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి కూడా ఈ సమావేశంలోనే నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గా్ల్లో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ పార్లమెంట్ స్థానంతో పాటు బెంగాల్‌ టీఎంసీ నేత షేక్ నూరుల్ ఇస్లామ్ మరణంతో ఖాళీ అయిన బషీర్‌హాట్ ఎంపీ స్థానాలున్నాయి.

Related Posts
రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
Prime Minister Modi left for Russia

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్‌లో, ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు, Read more

Trump : ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్ కు షాక్?
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన ప్రకటన ప్రకారం, వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు ఇకపై అమెరికాతో చేసే Read more

ప్రతి ప్రత్యక్ష క్షణాన్ని క్యాప్చర్ చేయండి.. ఒప్పో
OPPO Reno13 series launched in India with new MediaTek Dimensity 8350 chipset and AI ready cameras

OPPO Reno13 సిరీస్ GenAIని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది భారతదేశ మార్కెట్లో AI-శక్తితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త కొలమానాలను నిర్దేశిస్తుంది. IP66 / Read more

మీడియా పై మోహన్ బాబు దాడి
mohanbabu attack

మంచు ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సమస్యలు రోడ్డుపైనే తీవ్ర స్థాయికి చేరాయి. జల్‌పల్లిలోని మంచు టౌన్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంచు మనోజ్ ఇంటి గేటు దగ్గరకు Read more