Maharashtra and Jharkhand assembly election schedule released

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: మహారాష్ట్ర లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్‌ 4 వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్‌ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.

మరోవైపు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్‌ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్‌ 20న ఎన్నికలు ఉంటాయి. ఇక నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది.

ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు సీ విజిల్‌ యాప్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మద్యం, డ్రగ్స్‌, కానుకలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ వాలెట్‌లపైనా నిఘా ఉంటుందని.. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలపై నిఘా పెడుతున్నట్లు సీఈసీ తెలిపారు.

మరోవైపు జమ్ము కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కూడా సీఈసీ రాజీవ్‌ కమార్‌ మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్‌, హర్యానా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. కశ్మీర్‌ ఎన్నికల నిర్వహణపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందాయి. ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ఓటేశారు. హింసాత్మక ఘటనలు ఒక్కటీ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..

నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: 29 అక్టోబర్
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 4
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు..

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.
మొదటి ఫేజ్
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 10
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 10
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 25
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
పోలింగ్: నవంబర్ 13
ఓట్ల లెక్కింపు: నవంబర్ 25
రెండో ఫేజ్
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 29
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23

Related Posts
మీము అధికారంలోకి రాగానే టీడీపీ భరతం పడతాం – పెద్దిరెడ్డి
Peddireddy fire on Chandrab

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన Read more

నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. రఘురామ కృష్ణంరాజును ప్రకటించనున్న స్పీకర్
Election of AP Deputy Speaker today. Raghurama Krishnam Raju will be announced as Speaker

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు Read more

బంగ్లాదేశకు అమెరికా షాక్
USAID

బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ, అమెరికా దాతృత్వ సంస్థ యూఎస్ఏఐడీ (USAID) ఆ దేశానికి ఇచ్చే అన్ని రకాల సాయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం Read more

మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలో తెలుసా..?
RBI Bank Rpao

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 25 బేసిస్ పాయింట్లు (bps) వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందించాల్సిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *