Maharashtra and Jharkhand assembly election schedule released

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: మహారాష్ట్ర లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్‌ 4 వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్‌ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.

మరోవైపు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్‌ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్‌ 20న ఎన్నికలు ఉంటాయి. ఇక నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది.

ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు సీ విజిల్‌ యాప్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మద్యం, డ్రగ్స్‌, కానుకలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ వాలెట్‌లపైనా నిఘా ఉంటుందని.. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలపై నిఘా పెడుతున్నట్లు సీఈసీ తెలిపారు.

మరోవైపు జమ్ము కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కూడా సీఈసీ రాజీవ్‌ కమార్‌ మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్‌, హర్యానా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. కశ్మీర్‌ ఎన్నికల నిర్వహణపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందాయి. ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ఓటేశారు. హింసాత్మక ఘటనలు ఒక్కటీ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..

నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: 29 అక్టోబర్
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 4
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు..

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.
మొదటి ఫేజ్
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 10
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 10
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 25
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
పోలింగ్: నవంబర్ 13
ఓట్ల లెక్కింపు: నవంబర్ 25
రెండో ఫేజ్
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 29
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23

Related Posts
మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు
mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం Read more

కొత్త లబ్దిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’ తప్పనిసరి
formers

రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటం. అందుకే ప్రభుత్వాలు రైతులకు పలు పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా కొత్త లబ్దిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’ తప్పనిసరిగా Read more

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్
ktr comments on congress government

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో Read more

400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్
400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను తొలగించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఎవాల్యూయేషన్ టెస్ట్ లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *