ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు మద్రాసు హైకోర్టు ప్రశ్న

Madras High Court question to spiritual guru Jaggi Vasudev
Madras High Court question to spiritual guru Jaggi Vasudev

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాకుండా వాసుదేవ్‌కు పలు ప్రశ్నలు సంధించింది. తమ కూతుర్లకు పెళ్లి చేసిన సద్గురు ఇతరుల పిల్లలను ఎందుకు పెళ్లి చేసుకోవద్దని బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఇషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

‘తన కూతురుకి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి ఇతరుల కూతుళ్లను సన్యాసిగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాం. అనే సందేహాన్ని’ ధర్మాసనం వ్యక్తం చేసింది. కోయంబత్తూరుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెబుతూ అక్టోబర్ 4న విచారణను వాయిదా వేసింది. అయితే, 42, 39 ఏళ్ల వయస్సు గల “బాగా చదువుకున్న తన కుమార్తెలకు సద్గురు “బ్రెయిన్ వాష్” చేశారని ఆరోపిస్తూ కామరాజ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its. Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Taiwan’s scenic tourist destination faces earthquake risks from active faults.