Legal notices to former CM KCR.

మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసులు..!

హైదరాబాద్‌: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది లేదు. దీంతో.. కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం (ఫిబ్రవరి 03న) లీగల్ నోటీసులు పంపింది. ఈ మేరకు కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్‌తో పాటు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా లీగల్ నోటీసులు పంపించారు.

Advertisements

అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్‌పాల్‌ కోరారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో వెల్లడించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్‌ పోరాటం చేయాలని.. లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను వెంటనే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు స్పీకర్‌ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయ్‌ పాల్‌ కోరారు.

image

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీ వైపు చూడటమే మానేశారు. పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా అధికార పార్టీ నేతలు.. ఎన్ని విమర్శలు చేసినా, బహిరంగంగానే ఛాలెంజ్‌లు విసిరినా.. గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు తప్పా.. అలాంటి వాటికి ఏమాత్రం స్పందించకపోవటం గమనార్హం. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసులే పంపించగా.. గులాబీ బాస్ ఎలా స్పందించనున్నారన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Related Posts
దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్
దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ, ఆ దావాలకు చట్టబద్ధత లేదని మాజీ మంత్రి టి. హరీష్ రావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం Read more

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్
ktr comments on congress government

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో Read more

Mallikarjun Kharge : ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడీ చార్జిషీట్ : మల్లికార్జున ఖర్గే
ED chargesheet is part of vendetta politics... Mallikarjun Kharge

Mallikarjun Kharge : పార్టీ జనరల్‌ సెక్రటరీలు, ఇంఛార్జీల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వక్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు Read more

ఇరగదీసిన మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో వైరల్
ఇరగదీసిన మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో వైరల్

హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో ప్రజలంతా ఒక్క చోట చేరి రంగులు పూసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.చిన్న పిల్లలు, పెద్దలు కూడా Read more

×