📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

News Telugu: World Cup: సెమీస్ లో అడుగు పెట్టిన భారత మహిళా జట్టు

Author Icon By Rajitha
Updated: October 24, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ (india) మహిళా జట్టు అద్భుతంగా రాణించింది. వరుస పరాజయాలతో కొంత వెనుకబడి ఉన్న టీమ్ ఇండియా, కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ విజయంతో భారత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి ఎగబాకింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌కి దిగింది. ఈ నిర్ణయమే కివీస్‌కు తరువాత తలనొప్పిగా మారింది. ఓపెనర్లు స్మృతి మంధాన మరియు ప్రతీక రావల్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. స్మృతి తన స్టైల్‌లో చెలరేగి 88 బంతుల్లో శతకాన్ని నమోదు చేసింది. మరోవైపు ప్రతీక 122 పరుగులతో కివీస్ బౌలర్లను చితక్కొట్టింది. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి భారత స్కోరును 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు వరకు చేర్చింది.

Read also: Babar: పాకిస్థాన్ టీ20 జట్టులో బాబర్ రీ ఎంట్రీ

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మంచి ఆరంభం ఇచ్చినా, టార్గెట్‌ చాలా పెద్దది కావడంతో ఒత్తిడికి గురయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్‌ డక్‌వర్త్‌–లూయిస్‌ పద్ధతిలో కొనసాగింది. 44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌, బ్రూక్‌ హాలిడే (81), ఇసబెల్లా గేజ్‌ (65 నాటౌట్), అమేలియా కెర్‌ (45) కాస్త పోరాడినా విజయం సాధించలేకపోయారు. చివరికి కివీస్‌ 8 వికెట్లకు 271 పరుగులకే పరిమితమయ్యారు. భారత్‌ బౌలర్లలో రాజేశ్వరి గాయక్వాడ్, రేణుకా సింగ్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీసి కివీస్‌ జట్టును కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి మరోసారి తమ సామర్థ్యాన్ని చాటుకుంది.

మహిళల వరల్డ్‌కప్‌లో భారత్‌ జట్టు ఏ దశకు చేరుకుంది?
భారత్‌ మహిళా జట్టు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

భారత్‌ ఏ జట్టుపై గెలిచి సెమీస్‌లోకి చేరింది?
న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Cricket News India Women latest news Smriti Mandhana Telugu News Women’s World Cup 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.