📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Latest News: Women Cricketers: ఆస్ట్రేలియా క్రికెటర్లపై వేధింపులు.. నిందితుడికి ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు

Author Icon By Anusha
Updated: October 26, 2025 • 10:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. మహిళల వన్డే ప్రపంచకప్‌–2025 (Women’s ODI World Cup–2025) కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లపై స్థానిక యువకుడు అకీల్ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే సంఘటనగా మారింది. హోటల్‌ నుంచి సమీపంలోని కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణులను

Read Also: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌?

బైక్‌పై వెంబడించి, అనుచితంగా తాకేందుకు ప్రయత్నించిన అకీల్ ఖాన్‌ వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. వెంటనే ఆ మహిళా క్రికెటర్లు SOS నోటిఫికేషన్ పంపారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారికి రక్షణ కల్పించారు. పోలీసులు వస్తోన్నారనే సమాచారం తెలిసిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు

ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అతడి అరెస్ట్‌ను తెలియజేసేలా పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నిందితుడి చేయి, కాలుకు కట్లతో కుంటుతూ కనిపించాడు. దేశం పరువు తీసిన వాడికి పోలీసులు సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ఈ ఘటన బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో (social media) తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడాకారులు ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు వారికి గౌరవం, భద్రత కల్పించడం మన దేశ బాధ్యత అని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమరాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా మహిళా టీమ్ మేనేజర్ డానీ సిమ్మన్స్ (Danny Simmons) ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 (మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరపూరిత బల ప్రయోగం), సెక్షన్ 78 (వెంబడించడం) కింద ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.