Israel-Iran War: అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వచ్చాయా?

Read Time:  1 min
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వచ్చాయా?
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వచ్చాయా?
FONT SIZE
GET APP

ప్రస్తుత ఇరాన్ యుద్ధంలోకి అమెరికాను ఇజ్రాయెల్ ‘బలవంతంగా’ నెట్టిందన్న ఆరోపణలను బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఖండించారు. ఒక పత్రికా సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాట్లాడారు. “ఏం చేయాలో అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలనే ఆలోచన నిజంగా ఎవరికైనా వస్తుందా? ” అని నెతన్యాహు ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో సహా పలువురు ఇరాన్ అగ్ర నాయకులు, సైనిక అధికారులు మరణించారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ దాడులు జరిగాయి. ‘యుద్ధంలో చేరమని ఇజ్రాయెల్ తనను బలవంతం చేసిందన్న’ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా నిరంతరం ఖండిస్తూ వచ్చారు. “నేనే వారిని బలవంతం చేసి ఉండవచ్చు” అని ఈ నెల ప్రారంభంలో వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు. “చూడండి, మేం వాళ్లతో చర్చలు జరుపుతున్నాం, వారే ముందు దాడి చేస్తారని నేను అనుకున్నాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Read Also: US-Israel vs Iran: ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేలా ట్రంప్ సర్కార్ అడుగులు


Israel-Iran War: Are there differences between America and Israel?

Israel-Iran War: Are there differences between America and Israel?

ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ దాడులు చేసింది

అయితే ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒకే అభిప్రాయంతో ఉన్నాయా అనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తనకు “ఏమీ తెలియదని” బుధవారం(మార్చి 18) ట్రంప్ పరోక్షంగా విమర్శించిన తర్వాత ఈ ప్రశ్నలు మరింత బలపడ్డాయి. ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇటీవల జరిగిన దాడి గురించి ఇజ్రాయెల్ ట్రంప్‌కు తెలియజేసిందా అని నెతన్యాహును అడిగినప్పుడు ఆయన “ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ దాడులు చేసింది” అని సమాధానమిచ్చారు. “మరిన్ని దాడులు చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ మమ్మల్ని కోరారు. మేం అందుకు అంగీకరించాం” అని కూడా ఆయన అన్నారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి నెతన్యాహుని ప్రశ్నించగా, హెజ్బొల్లా వ్యక్తులు చొరబడకుండా నిరోధించే ఒక “భద్రతా కారిడార్”ను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిందని నెతన్యాహు బదులిచ్చారు. “మాకు భవిష్యత్తు కోసం కూడా ప్రణాళికలు ఉన్నాయి” అని ఆయన అన్నారు. “మా అతిపెద్ద లక్ష్యం ఇరాన్ ప్రభుత్వం. అది కూలిపోతే హెజ్బొల్లా కూడా అంతమైపోతుంది” అని ఆయన అన్నారు. ఇరాన్ అగ్ర నాయకత్వంలో చీలికలు, అంతర్గత ఉద్రిక్తతలు ఉన్నాయని, మాజీ సుప్రీంలీడర్‌కు ఉన్న ‘పట్టు, అధికారం’ ఎప్పటికీ ఎవరికీ ఉండదని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.