Iran Oil: మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు..ఇండియాకు ప్రయోజనం ఎంత?

Read Time:  1 min
మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు..ఇండియాకు ప్రయోజనం ఎంత?
మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు..ఇండియాకు ప్రయోజనం ఎంత?
FONT SIZE
GET APP

ప్రస్తుతం సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు(Iran Oil) పై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో సుమారు 14 కోట్ల బ్యారళ్ల చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి రావడానికి వీలు కలుగుతుంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయతే ప్రస్తుతం సముద్రంలో రవాణాలో ఉన్న ఆయిల్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని.. ఇరాన్ కొత్త ఆర్డర్లు తీసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి వీలు లేదని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఇలాంటి సంకేతాలిచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బెసెంట్ మాట్లాడుతూ.. ఇప్పటికే సముద్రంపై ఉన్న ఇరాన్ చమురు మీద పరిమితులను సడలించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ఈ నిర్ణయంతో యుద్ధం వల్ల ఉత్పత్తి, రవాణాలో ఏర్పడిన ఇబ్బందులనుదాటి పదుల కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇండియా తన చమురు అవసరాలలో 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. తక్కువ ధరకు చమురు దొరికినప్పుడు వెంటనే కొనుగోలు చేసే అలవాటున్న కారణంగా చిన్న అవకాశం అయినా భారత్‌కు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

Read Also: Big Shock : అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్

Iran Oil: 140 million barrels of Iranian oil entering the market.. What is the benefit for India?
Iran Oil: 140 million barrels of Iranian oil entering the market.. What is the benefit for India?

Iran Oil: ధరలను నియంత్రించాలననుకుంటున్నట్టు అమెరికా

ప్రస్తుతం సముద్రంలో ఉన్న ఇరానియన్ కార్గో ద్వారా దాదాపు 14 కోట్ల బ్యారెళ్ల చమురు కొనుగోలుదారులకు చేరేలా అనుమతించి సరఫరా లోటును తాత్కాలికంగా తగ్గించాలని, ధరలను నియంత్రించాలననుకుంటున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. ‘ఈ చర్య చైనాకు వెళ్లే చమురు సరఫరాను మళ్లించే అవకాశం ఉంది. కాబట్టి చైనా మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. కానీ భారత్, జపాన్, మలేషియా వంటి ఇతర ఆసియా వినియోగదారులకు ముడి చమురు అందుబాటులోకి వస్తుంది’ అని బెసెంట్ చెప్పారు.దీని ద్వారా ఇరాన్ చమురును ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం మారుతుంది. చైనీస్ రిఫైనర్స్ ఎక్కువ పోటీకి సిద్ధం అయి, మార్కెట్ రేట్లకు దగ్గరగా చెల్లించాల్సి వస్తుంది.

ఇరాన్ క్రూడ్ ఆయిల్‌ను ఎక్కువగా భారత్ కొనుగోలు

“చైనా ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ రిఫైనర్లు, ఇతర ఆసియా దేశాలతో పాటు, భారత్ కూడా ముఖ్యమైన డిమాండ్ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది” అని మారిటైమ్ ఇంటెలిజెన్స్ కంపెనీ కేప్లర్‌లో రిఫైనరీ, చమురు మార్కెట్ల విశ్లేషకులు సుమిత్ రిటోలియా చెప్పారు.గతంలో ఇరాన్ క్రూడ్ ఆయిల్‌ను ఎక్కువగా భారత్ కొనుగోలు చేసేది. భారత్ మొత్తం చమురు దిగుమతిలో సుమారు 11.5% ఇరాన్ నుంచే వచ్చేది. లైట్, హెవీ గ్రేడ్ ఇరాన్ ముడి చమురు భారతీయ రిఫైనరీలకు అనుకూలంగా ఉండేది. ఈ గ్రేడ్‌లు భారత రిఫైనరీల ప్రాసెసింగ్ సామర్థ్యాలకు సరిపోయేవి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.