ఈ ఏడాది భారతీయ సంగీత ప్రపంచం యూట్యూబ్ వేదికగా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ప్రముఖ సంగీత దర్శకుల నుంచి వచ్చిన పాటలు కోట్ల వ్యూస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ట్రెండీ బీట్స్,(Trending songs 2025) క్యాచీ లిరిక్స్, అద్భుతమైన విజువల్స్ కలిసి ఈ పాటలను టాప్ ట్రెండ్స్‌లో నిలిపాయి.
Read Also: Prabhas The Raja Saab : ది రాజా సాబ్ USA బాక్సాఫీస్ షాక్ ప్రభాస్ అడ్వాన్స్ బుకింగ్స్
ప్రేక్షకులను అలరించిన టాప్ ట్రెండింగ్ పాటలు
ఈ ఏడాది అనిరుధ్ రవిచందర్, సంతోష్ నారాయణన్, ఏ.ఆర్. రెహమాన్, జీవీ ప్రకాష్ కుమార్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల పాటలు యూట్యూబ్‌లో(Trending songs 2025) భారీ ఆదరణ పొందాయి. ముఖ్యంగా:
- రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలోని మోనికా పాట
- సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ లోని కనిమా, కన్నడి పూవే
- ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని గోదారి గట్టు
- రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ లోని జరగండి జరగండి
- ‘డాకు మహారాజ్’ లోని దబిడి దబిడి
- ‘తండేల్’ నుంచి బుజ్జితల్లి
- పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ టైటిల్ సాంగ్
- ‘కోర్ట్’ సినిమాలోని కథలెన్నో చెప్పారు
ఈ పాటలు విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.
యూట్యూబ్‌లో సాంగ్స్ ట్రెండ్ అవడానికి కారణాలు
- సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్‌కు అనుకూలంగా ఉండే మ్యూజిక్
- యువతను ఆకట్టుకునే బీట్స్, స్టెప్పులు
- స్టార్ హీరోల క్రేజ్, విజువల్ అప్పీల్
- మ్యూజిక్ డైరెక్టర్లకు ఉన్న గ్లోబల్ ఫ్యాన్‌బేస్
ఈ అంశాలన్నీ కలిసి ఈ పాటలను యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌కు చేర్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: