భారత్ -అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఒప్పందం డీల్ కాదు, దోపిడీ అని పేర్కొంటూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పించింది. ఈ ఒప్పందం అమెరికాకు లాభదాయకంగా, భారత్‌కు నష్టం కలిగించేలా ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) అన్నారు. ఇది మన రాజకీయ గౌరవం, ఆర్థిక దౌత్యం వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read Also: Nokia: భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
ట్రంప్ తరఫున ప్రచారం
‘ప్రధాని మోదీని వ్యతిరేకించని స్వతంత్ర విశ్లేషకులు కూడా ఈ ఒప్పందాన్ని లొంగుబాటు, అసమాన ఒప్పందం, అమ్ముడుపోవడం, అవమానకరమైన వెనకడుగు అని విమర్శించారు. ప్రధాని మోదీ, ఆయన అబద్దాల బృందం ఎంత గొప్పగా చెప్పినా, వాస్తవం మాత్రం ఒక్కటే. అది భారత్ నుంచి అమెరికా ఎక్కువ తీసుకుంటుంది. తక్కువ ఇస్తుంది. 2019 సప్టెంబర్‌లో ట్రంప్ తరఫున ప్రచారం చేయడం సహా, మోదీ ఆయనను తీవ్రంగా మెప్పించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం రాలేదు. 2025 ఫిబ్రవరిలో తిరిగి ఎన్నికైన వెంటనే ట్రంప్‌ను మొదట అభినందించిన నాయకుల్లో మోదీ ఒకరు’ అని జైరాం రమేశ్ అన్నారు. ‘ట్రేడ్ డీల్ విషయంలో మోదీ ప్రభుత్వం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పణంగా పెట్టింది. మధ్యంతర వాణిజ్య ఒప్పందంలోని నిజాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. 25 శాతం అదనపు సుంకాలు తగ్గించేందుకు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు ఆపడానికి భారత్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటన స్పష్టం చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా భారత వ్యవసాయ మార్కెట్‌లో విదేశీ ఉత్పత్తులకూ కేంద్రం ద్వారాలు తెరిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: