The Kerala Story 2: ‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

Read Time:  1 min
The Kerala Story 2: 'కేరళ స్టోరీ-2' విడుదలకు గ్రీన్ సిగ్నల్
The Kerala Story 2: 'కేరళ స్టోరీ-2' విడుదలకు గ్రీన్ సిగ్నల్
FONT SIZE
GET APP

The Kerala Story 2: బాలీవుడ్ నుంచి రాబోతున్న ‘ది కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్’ వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచిన సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. గతంలో సినిమా ప్రదర్శనపై ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కేరళ హైకోర్టు (Kerala High Court) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ఉన్న చట్టపరమైన చిక్కులు తొలిగిపోయాయి.

Read Also: Virosh Wedding: ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

The Kerala Story 2: 'కేరళ స్టోరీ-2' విడుదలకు గ్రీన్ సిగ్నల్
The Kerala Story 2: Green signal for the release of ‘Kerala Story-2’

ఈ సినిమా విడుదలపై ఫిబ్ర‌వ‌రి 26న‌ విధించిన 15 రోజుల స్టేను జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి మరియు జస్టిస్ పి.వి. బాలకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఫిబ్రవరి 26న సినిమాను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) స్వభావం ఉన్న ఇలాంటి అంశాలను సింగిల్ బెంచ్ విచారించడం సరికాదని అభిప్రాయపడింది. వాక్ స్వాతంత్య్రం, కళాత్మక స్వేచ్ఛను గౌరవిస్తూ, సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.