Actress Jaya Prada: భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద తన గత జీవితంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 14 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టి, సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె, ఒక ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి మనసు విప్పి మాట్లాడారు.
Read Also: Anirudh Ravichander: యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం
తెలుగుతోపాటు.. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. 1986 జూన్ 22న సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు జయప్రద. సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో జయప్రద మాట్లాడుతూ.. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం పెళ్లి చేసుకోవడమే అని చెప్పి షాక్ ఇచ్చారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా.. పెళ్లి చేసుకున్న సమయంలో నా వయసు 25 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని, నా కెరీర్‌ను నాశనం చేసిందని జయప్రద తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: