TG Inter Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. రేపటి (బుధవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు. మొదటి సంవత్సరం 4,89,126 మంది రెండో సంవత్సరం 5,07,949 మంది ఈ పరీక్షలకు సిద్ధమయ్యారు.
Read also: RTC Bus Lost and Found: ఆర్టీసీ బస్సులో వస్తువులు మర్చిపోయారా?
ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవడం మంచిది. హాల్ టికెట్లను https://tgbieht.cgg.gov.in వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా, పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: