📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: మేడారంలో విజయవంతంగా మహిళా సంఘాల వ్యాపారం

Author Icon By Saritha
Updated: February 13, 2026 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ములుగు జిల్లా స్వయంసహాయక సంఘాల మహిళల రికార్డు

హైదరాబాద్ : ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహంతో మేడారం సమ్మక్క- సారలమ్మ (Medaram) జాతరలో మహిళా సంఘాలు విజయవంతంగా పలు వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించాయని (Telangana) తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. జాతరలో స్వయంసహాయక సంఘాల మహిళలు మొత్తం 565 వ్యాపార కార్య కలాపాలను నిర్వహించారు. మొత్తం రూ.603.30కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడితో మొత్తం రూ.9కోట్ల 12లక్షల రూపాయల 68వేల రూపాయల ఆదాయం రాగా అందులో పెట్టుబడిగా పెట్టిన రూ.6కోట్ల 3లక్షల30వేలు పోను మొత్తం రూ.3కోట్ల 9లక్షల 38వేల లాభం సమకూరింది.

Read Also: Fire Safety Awareness: ప్రజల భద్రతకు హైడ్రా పెద్దపీట

Successful women’s group business in Medaram

పెట్టుబడితో లాభం: మంత్రి సీతక్క హర్షం

(Telangana) ములుగు జిల్లాలోని అన్ని మండలాల స్వయం సహాయక సంఘాల మహిళలకు మేడారం జాతరలో ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారం నిర్వహించే అవకాశం కల్పించారు. దీంతో జిలాల్లోని 10 మండలాల ఎస్పీచి మహిళలకు వ్యాపార అవకాశాలు జాతరలో లభించాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు మేడారం జాతరలో విజయవంతంగా వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో లాభం సంపాదించడంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.