Telangana Budget updates: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని (EHS) బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, 421 ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగులు చికిత్స పొందవచ్చు.
Read Also: TG Health Budget: 2026 చివరి నాటికి మూడు టిమ్స్ ఆసుపత్రులు ప్రారంభం!

Telangana Budget updates: ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు
ఈ పథకం కింద మొత్తం 1,998 రకాల వ్యాధులకు నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుంది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి, పెన్షనర్కు డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయనుంది. ఈ కార్డుల ద్వారా ఆసుపత్రుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా తక్షణమే చికిత్స పొందే వీలుంటుంది. పాత పద్ధతిలో ఉన్న ఇబ్బందులను తొలగించి, సాంకేతికతను జోడించి ఈ ఆరోగ్య పథకాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: