📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Agriculture: ప్రైవేటు వ్యాపారుల చేతిలో మక్క రైతుల నిలువు దోపిడీ

Author Icon By Saritha
Updated: March 20, 2026 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Agriculture: అష్టకష్టాల కోర్చి పండించిన పంటను మార్కెట్ కు తీసుకొస్తే మద్దతు ధర రాకపోవడంతో మొక్కజొన్న రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్కు పంటను తీసుకొచ్చి రోజుల తరబడి మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది మార్కెఫెడ్ మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతోపాటు మార్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపారులు, దళారులు క్వింటాల్ మొక్కజొన్నకు రూ.1700 నుంచి రూ.1900 లోపు ధర పెడుతూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

Read Also: Good News : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్‌ శుభవార్త

Telangana Agriculture: Vertical exploitation of maize farmers at the hands of private traders

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

మార్ఫెడ్ ద్వారా ప్రాథమిక సహాకర కేంద్రాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను మక్కలను కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులు క్వింటాకు రూ.600 కు తక్కువగా ప్రయివేటుకొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల తీవ్రజాప్యం క్వింటాల్ కు గరిష్టంగా రూ.1,900లే చెల్లిస్తున్న వ్యాపారులు ఫలితంగా క్వింటాపై రూ.600 దాకా నష్టపోతున్న అన్నదాతలు వ్యాపారులకు అమ్ముకుని ఆర్థికంగా చితికిపోతు న్నారు. గతేడాది మార్కెఫెడ్ ద్వారా మక్కలను క్వింటాలు రూ.2400 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశారు. అయితే ఈసారి కూడా మంచి ధర వస్తుందని ఆశించినా రైతులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంతో ఈ యాసంగి సీజన్లో మక్కల సాగు పలు జిల్లాల్లో పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది.

రాష్ట్రంలో రబిలోదాదాపు 16 లక్షల టన్నుల మక్కల దిగుబడి వస్తోంది. ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల మక్కల దిగుబడి వస్తోంది. మొక్కజొన్న పంట కేవలం ఆహార పంటగానే కాకుండా బహుళ ప్రయోజనాలున్న పంటగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మక్కల ను దాణా రూపంలో పౌల్టిరంగంలో, పశువుల కు మేతగా, వివిధ ఆహార పరిశ్రమల్లో ముడ సరుకుగా (స్టార్చ్ తయారికి) వినియోగించడం తోపాటు పేలాలు, తీపి కండె, బేబికార్న్ వంటి ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. మార్కెట్లో మక్క పంటకు డిమాండ్ ఉన్నప్పటికీ ఆ పంటను పండించిన రైతులకు మాత్రం కనీస మద్దతు ధర రాకపోవడంపై వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Corn Price Latest News in Telugu Maize Farmers Loss Markfed Maize Procurement Telangana agriculture Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.