VK Sasikala-S Ramadoss: తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణం: చేతులు కలిపిన శశికళ, రామదాస్

Read Time:  1 min
tamil-nadu-elections-sasikala-ramadoss-alliance-pmk-aiptmmk
tamil-nadu-elections-sasikala-ramadoss-alliance-pmk-aiptmmk
FONT SIZE
GET APP

VK Sasikala-S Ramadoss: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం సంభవించింది. ఇద్దరు సీనియర్ నేతలు—పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రామదాస్, జయలలిత నెచ్చెలి వీకే శశికళ—రాబోయే ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల కోసం జతకట్టారు. ఈ కొత్త కూటమి ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు ఇది గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Tamil Nadu Elections : తమిళనాడులో AIADMKదే పైచేయి?

tamil-nadu-elections-sasikala-ramadoss-alliance-pmk-aiptmmk
tamil-nadu-elections-sasikala-ramadoss-alliance-pmk-aiptmmk

VK Sasikala-S Ramadoss: రాజకీయ ఉనికి కోసం సరికొత్త వ్యూహం

తమ సొంత పార్టీల్లోనే ఈ ఇద్దరు నేతలు ఒంటరి కావడం గమనార్హం. పీఎంకేలో తన కుమారుడు అన్బుమణి రామదాస్‌తో విభేదాల కారణంగా ఎస్.రామదాస్ పార్టీపై పట్టు కోల్పోయారు. మరోవైపు, అన్నాడీఎంకేను దక్కించుకోలేకపోయిన శశికళ ‘ఏఐపీటీఎంఎంకే’ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే వీరిద్దరూ ఏకమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

విల్లుపురం జిల్లా తైలాపురంలోని రామదాస్ నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తమ కూటమి తరఫున అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. తమ కూటమిలోకి మరిన్ని చిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు రామదాస్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.