Tamil Nadu Election 2026: ఎన్డీయేలోకి వెళ్లే ప్రసక్తే లేదు: విజయ్

Read Time:  1 min
Tamil Nadu Election 2026: ఎన్డీయేలోకి వెళ్లే ప్రసక్తే లేదు: విజయ్
FONT SIZE
GET APP

Tamil Nadu Election 2026: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన దశకు చేరుకున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల తేదీ (ఏప్రిల్ 23) ఖరారు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగాన్ని పెంచాయి.

Read Also: Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

మహాబలిపురంలో ఇఫ్తార్ వేడుక – విజయ్ సందేశం

రంజాన్ మాసం సందర్భంగా మహాబలిపురంలో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.రంజాన్ సందర్భంగా తమిళనాడులోని మహాబలిపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అన్ని మతాలు సమానం అని.. అన్ని మతాల విశ్వాసాలను కాపాడటంలో టీవీకే పార్టీ కాంప్రమైజ్ అవ్వదని తెలిపారు. తమిళనాడులో ఒంటరిగానే పోటీ చేస్తామని వివరించారు. ఎన్డీయే కూటమిలోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

Tamil Nadu Election 2026: No question of joining NDA: Vijay
Tamil Nadu Election 2026: No question of joining NDA: Vijay

కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు

తాము ఎవరి టీమ్ కాదని.. ప్రజల టీమ్ అని విజయ్ పేర్కొన్నారు. టీవీకే లీడర్ షిప్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఉంటుందని విజయ్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక న్యాయం, సెక్యూలరిజంపై కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని విజయ్ తేల్చి చెప్పారు. రకరకాలుగా తమను అణచివేయాలని కొన్ని శక్తులు ప్లాన్ చేస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తమపై ఫేక్ ప్రచారం నిర్వహిస్తున్నాయని విజయ్ మండిపడ్డారు.ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే అమలు చేస్తామని అందులో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పొత్తుపై మరోసారి విజయ్ క్లారిటీ ఇచ్చారు. సింగిల్ గానే పోటీ చేస్తామని తమకు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతో పొత్తు లేదని తేల్చారు. దేవుడి దయతో అనుకున్న టార్గెట్ ను సాధిస్తామని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.